Saturday 12 December 2020

Panchbhakshya paramannaalu details and information

మన పూర్వీకులు మనం ఏం తినాలి... ఎలా తినాలో తదితర అంశాలు ఎన్నో తెలిపారు... కానీ మనం చాలా వరకు విషయాలను మధ్యలో వదిలేసి ఒక పద్ధతి ప్రకారం భోజనం చేయక చాలా అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాము... అసలు పెద్దలు మనకు భోజనాన్ని ఎలా చేయాలో పంచభక్ష్య పరమాన్నాలు అనే పేరులోనే తెలిపారు... మనలో చాలా మందికి పంచభక్ష్య పరమాన్నాలు అనే పేరు తెలుసు కానీ అవి ఏమిటో చాలా మందికి తెలియదు.. నిజంగా పంచభక్ష్య పరమ్మాన్నాలు అంటే అవి 5 రకాల ఆహారములు.... అవి
Panchbhalshya paramannaalu details and information

భక్ష్యం - అంటే కొరికి తినేది
భోజ్యం - అంటే నమిలి మింగేది
లేహ్యం - అంటే నాకి తినేది
చోష్యం - అంటే పీల్చుకొనేది/ జుర్రుకొనేది
పానీయం - అంటే తాగేది
 
మనం తినే ఆహారం సమీకృతంగా మరియు జీర్ణక్రియ సక్రమంగా ఉండాలని మన పెద్దలు తయారు చేసిన ఆహార ప్రణాళికలో భాగాలు ఇవి.
మనం రోజూ తినే పదార్థాలు ఏ కోవలోకి రాగలవో ...ఒక ఉదాహరణ మాత్రమే..

భ క్ష్యం - గారెలు, బూరెలు, బొబ్బట్లు లాంటివి

భోజ్యం - అన్నంతో చేసేన పులిహోరా లాంటివి
(ఇవి చింతపండు వగైరా జీర్ణరసాన్ని వృద్ధి చేసి తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది... )  

లేహ్యం - నేను మన పచ్చళ్ళని దీని క్రింద చేర్చుతాను(ఇవి నోటిలో లాలాజలం వృద్ధి అవడానికి తోడ్పడుతాయి... )

చోష్యం - సాంబార్, రసం. పాయసం, పెరుగు లాంటివి

పానీయం - మంచినీరు, పానకం, ఫలరసాలు వంటివి.(ఇవి రెండు ఆహారాల మధ్య సంధిలా ఉపయోగించుకోవచ్చు)




For more interesting Topics... 

Post a Comment

Whatsapp Button works on Mobile Device only